కర్ణాటక పై కన్ను .. !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను ఇప్పుడు కర్ణాటక పై పడింది. బెంగళూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది మే నెలలో జరిగే శాసన సభ ఎన్నికల్లో గట్టి పోటీదారుగా నిలిచేందుకు వ్యూహ రచన చేస్తోంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరులో రైతుల సభలో మాట్లాడారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తాము ప్రభుత్వాలను ఏర్పాటు చేశామని, ఇక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మూడో రాష్ట్రం కర్ణాటకేనని చెప్పారు.