కన్నడ భాషను బ్రతికించండి
1 min readపల్లెవెలుగు, వెబ్ ఆదోని: కన్నడ భాషను బ్రతికించాలంటూ మండలం పరిధిలో పెద్దహరివాణం గ్రామంలో కన్నడ విద్యార్థి సంఘం నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం పెద్ద ఎత్తున గ్రామ పురవీధులలో ర్యాలీ నిర్వహించి, స్థానిక జడ్పీ హైస్కూల్లో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామస్తులు ఆదినారాయణ, రాము,జడ్పీ హైస్కూల్ చైర్మన్ బాలప్ప,కన్నడ విద్యార్థి సంఘ నాయకులు నాగరాజ్,రామన్న, సంతోష్, జంబునాత,మార్లబండి రంగస్వామి మాట్లాడుతూ ఆదోని డివిజన్ పరిధిలో ఆదోని పట్టణంతోపాటు,హుళుగుంద, హాలహర్వి,కౌతాళం,మాధవరం, పెద్దహరివాణం,బదినేహాల్ తదితర సరిహద్దు గ్రామాలలో కన్నడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు.ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలు తమ మాతృభాష అయినటువంటి కన్నడ భాషలోనే విద్యాభ్యాసం చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం సిరుగుప్ప,బళ్లారి,రాయచూర్ పట్టణాన కర్ణాటక ప్రాంతలకు పోతున్నారని అన్నారు.ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్.వసతిదీవన,అమ్మఒడి,ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేక పోతున్నారని,బస్సు పాస్ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదిని తెలిపారు.కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కన్నడ చదివే విద్యార్థులకు కర్ణాటక రాష్ట్రంలో ఉచిత హాస్టల్,బస్సుపాస్,విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న కన్నడ విద్య విద్యార్థులకు కర్ణాటక రాష్ట్రంలో 10% రిజర్వేషన్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని కన్నడ సంఘం తరఫున డిమాండ్ డిమాండ్ చేశారు.ఇప్పటికే ఆదోని పట్టణంలో ఉన్న కన్నడ పాఠశాల అయినటువంటి ఆలమ్మ,గంగమ్మ స్కూల్,మిఠాయి చిన్నబశప్ప స్కూల్,వీరసేవ స్కూల్ మూతబడ్డాయని తెలిపారు.ఇప్పటికే చివరి దశలో ఉన్న ఎల్లిమల్లేష్ప్ప స్కూల్ మూతపడకుండా ముందస్తుగానే ప్రభుత్వం స్పందించాలన్నారు.లేని పక్షంలో కన్నడ భాషకు ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు,మూకప్ప, ఉపాధ్యాయులు వీరశ్రీ,శివకుమార్ గౌడ్,అశ్వతప్ప, సూర్య ప్రకాష్ పాల్గొన్నారు.