PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కెసిఆర్ బిడ్డా నోరు అదుపులో పెట్టుకో..!

1 min read

– గుడిసె శివన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కెసిఆర్ బిడ్డా నోరు అదుపులో పెట్టుకో లేకపోతే నాలుక కోస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న హెచ్చరించారు. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. మా రాష్ట్రంకు రావలసిన బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ మీరు మా రాష్ట్రంలో ఉండే ప్రజలు మీకు సహకార అందించడం లేదని వక్రబుద్దితో మాట్లాడటం సరికాదన్నారు. నీకు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. ఏదో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి ఆ రోజుల్లో నీ గాలి వీచింది. అంతేతప్ప అది కెసిఆర్ గాలి కాదని హితవు పలికారు. నీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాలేవని సవాలు విసిరారు. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు మాట్లాడిన తీరు సరిగా లేదని మా బకాయిలు చెల్లించకుండా మా రాష్ట్రాన్ని ఇబ్బందులు గురిచేసిందే కాకుండా మా రాష్ట్రం గురించి మా రాష్ట్ర నాయకులు మరియు ప్రజల గురించి అసభ్యంగా అభ్యంతర కరంగా మాట్లాడి అందరూ మనసులు గాయపరిచారని గుడిసె శివన్న అన్నారు. బిఅర్ఎస్ పార్టీ అధినేత గా కాకుండా ఒక గాలినా కోడుకులా మాట్లాడుతూండటం చూస్తూఉంటే కెసిఆర్ కు పోయేకాలం వచ్చిందని ఆయన అన్నారు.

About Author