NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లిక్క‌ర్ అక్ర‌మాల సూత్ర‌ధారి కేజ్రీవాల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లిక్కర్‌ అక్రమాల వ్యవహారంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాలేనని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తును రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. విషయాన్ని పక్కదారి పట్టించొద్దని అన్నారు. ఆప్‌ నాయకుల అసలు రంగు బయపడిందని చెప్పారు. అనురాగ్‌ ఠాకూర్‌ శనివారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ సర్కారు ప్రభుత్వ ప్రతిష్ట పెరుగుతుండడం చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ఆప్‌ అసలు ఖాతా తెరవలేదని గుర్తుచేశారు. 2014, 2019 తరహాలో 2024లోనూ మోదీ నాయకత్వంలో బీజేపీ అద్భుత విజయం సాధించబోతోందని స్పష్టం చేశారు.

                                     

About Author