NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌ఫాయి కార్మికుడి కుటుంబానికి త‌న ఇంట్లో భోజ‌నం పెట్టిన కేజ్రీవాల్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంటికి అత‌డి ఆటోలోనే వెళ్లి… డ్రైవ‌ర్ కుటుంబంతో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నం చేసిన కేజ్రీవాల్… తాజాగా సోమ‌వారం గుజ‌రాత్‌కు చెందిన స‌ఫాయి కార్మికుడు హ‌ర్ష్ సోలంకి కుటుంబాన్ని త‌న ఇంటికి పిలిచి మ‌రీ కార్మికుడి కుటుంబానికి భోజ‌నం పెట్టారు. స‌ఫాయి కార్మికుడి కుటుంబంతో పాటు త‌న కుటుంబ స‌భ్యుల‌ను ఒకే టేబుల్‌పై కూర్చోబెట్టుకుని ఆయ‌న భోజ‌నం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు జాతీయ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కేజ్రీవాల్ ఇచ్చిన ఆతిథ్యానికి హ‌ర్ష్ సోలంకి క‌న్నీటిని ఆపుకోలేక‌పోయారు. త‌ల్లి, చెల్లితో క‌లిసి గుజ‌రాత్ నుంచి హ‌ర్ష్ సోలంకి ఢిల్లీ రాగా.. అత‌డి ప్ర‌యాణానికి సంబంధించిన మొత్తం ఏర్పాట్ల‌న్నీ ఆప్ నేత‌లే చూసుకున్నారు.

                                  

About Author