PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీజేపీ కర్నూలు జిల్లా కార్యదర్శి గా కె. రాఘవులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : బిజెపి కర్నూలు జిల్లా కార్యదర్శి గా కె.రాఘవులు ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రామస్వామి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శిగా కే రాఘవులు ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. నూతనంగా నియామకమైన కె. రాఘవులు మాట్లాడుతూ తనపై జిల్లా నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రాఘవులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సుధాకర్, బిజెపి నాయకులు వెంకట హరి, డి ఎన్. వెంకటేశ్వర్లు, తారక్ ఆచారి, హరిప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author