PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతర్ రాష్ట్ర కిడ్నాప్ ముఠాలో కీలక నిందితులు అరెస్ట్…

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల : రాష్ట్ర కిడ్నాప్ ముఠాలో కీలక నిందితులు  అరెస్ట్…. జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPSఫిర్యాది:- CH.నాగిరెడ్డి కిడ్నాప్ కాబడినవారు  :-1) CH వినాయక రెడ్డి S/o CH.నాగిరెడ్డి  , 2) భరత్ కుమార్ రెడ్డి S/o CH వినాయక రెడ్డి  3) సాయినాథ్ రెడ్డి – డ్రైవరు కిడ్నాప్ కాబడిన తేదీ:- 05-06-2023కిడ్నాప్ కాబడిన స్థలం:-  సీతాతామాపురం మెట్ట ,బేతంచర్ల మండలం ఫిర్యాదు చేసిన తేదీ :-07-06-202330-06-2023న 12 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి 40 లక్షల రూపాయల నగదును మరియు నేరము చేయు క్రమములో ఉపయోగించిన నాలుగు కార్లను మూడు సెల్ ఫోన్ లనుమరియు ఒక కత్తిని స్వాదినము చేసుకోవడమైనది,

 మిగిలిన ముద్దాయిలు 

 A-1: గోగుల నరేష్ , వయసు 30 సం.లు, తండ్రి: late G. గంగయ్య, R/o రామరాజు పల్లి, పెద్దవడుగూరు మండల్ అనంతపూర్ జిల్లా,  రికవరీ – Rs 92,56,000/- మరియు ఇదివరకు అరెస్ట్ అయిన A 3 వాటా 75 లక్షలు 

 A-2: చెన్నా భాస్కర్,  వయసు 31 సం. లు, తండ్రి: C.ప్రభాకర్, R/o పెద్దిరేద్దిపల్లి గ్రామము, పరిగి మండలము, సత్యసాయి జిల్లా, రికవరీ – Rs 95,04,200/-,  A-4: పుట్టపర్తి రఘు@ కదిరప్ప రఘు, వయస్సు: 27 సంలు, తండ్రి: కదిరప్ప, SC కాలనీ, పుట్టపర్తి, బాగేపల్లి తాలూకా, చిక్బల్లాపూర్ జిల్లా,  కర్ణాటక రాష్ట్రం. రికవరీ – Rs 3,53,800/- పై వారి నుండి మొత్తము Rs 2,66,14,000/- ( మొత్తం రెండు కోట్ల అరవై ఆరు లక్షల  రూపాయలు  స్వాదీన పరచుకొనడమైనది.

ఈ కేసులో ఇప్పటివరకు బాధితులు కిడ్నాపర్స్ కు ఇచ్చిన 4 కోట్ల రూపాయలలో మొత్తం Rs 3,06,14,000/- (మూడు కోట్ల ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయలు) స్వాదీన పరచుకొనడమైనది

అరెస్ట్ స్థలం:-  

అనంతపురం జిల్లా గుత్తి మండలం, గుత్తి టౌన్ కు ఊరి బయటగల టోల్ గేటు కు సుమారు అర్ధ కిలోమీటర్ దూరం లో బెంగలూరు నుండి హైదరాబాద్ పోయే NH-44 High Way పక్కన గల మూతబడిన పెట్రోల్ బంకు వద్ద  అరెస్ట్ చేయడమైనది.

జూన్ నెల 07 వ తేదీన బనగానపల్లే టౌన్ కి చెందిన CH.నాగిరెడ్డి అను వ్యక్తి బేతంచెర్ల పి‌ఎస్ కి వచ్చి 05.06.2023 వ తేదీ ఉదయము తన కొడుకు అయిన వినాయక రెడ్డి, తన మనవడు భరత్ కుమార్ రెడ్డి మరియు తన డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి 4 కోట్లు డబ్బులు ఇస్తే వదులుతాము అని బెదిరించగ, కిడ్నాపర్స్ కి బయపడిన నాగి రెడ్డి తనకు తెలిసిన వారి వద్ద నుండి 4 కోట్లు డబ్బులు జమ చేసుకొని తన మేనల్లుడు శంకర్ రెడ్డి ద్వారా రెండు విడతలు గా అనంతపురం జిల్లా చెన్నే కొత్తపల్లి వద్ద మరియు కర్నాటక రాష్ట్రము కోలార్ జిల్లా వద్ద కిడ్నాపర్స్ కు 4 కోట్ల రూపాయలు ఇచ్చినా కిడ్నాపర్స్ తన వాళ్ళను విడిచి పెట్టలేదని బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినాడు. ఈ విషయము గురించి బేతంచెర్ల పోలీస్ స్టేషన్ నందు Cr. No. 108/2023 U/Sec 342, 364-A, 386 r/w 34 IPC గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినారు.ఈ కేసు ధర్యాప్తు లో బాగముగా రాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు డోన్ DSP శ్రీ Y.శ్రీనివాసరెడ్డి  పర్యవేక్షణలో, బేతంచెర్ల సి‌ఐ G.ప్రియతమ్ రెడ్డి గారు, SI S.శివ శంకర్ నాయక్, ప్యాపిలి SI CM.రాకేశ్, SI లు M.నరేశ్, K.జగదీశ్వర రెడ్డి, కొలిమిగుండ్ల SI D.రమేశ్ రెడ్డి, SB SI K.N.హరినాథ రెడ్డి ఇంకా పోలీసు సిబ్బందితో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాటు చేసి కిడ్నాపర్సు కోసము ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినారు.సదరు నాలుగు బృందాలు డోన్ DSP గారి పర్యవేక్షణలో అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనంతపురం, బాగేపల్లి, చిక్బల్లాపూర్, బెంగుళూరు, కోలార్, మైసూరు, తుమ్కూర్, మొదలగు ప్రదేశాలలో తిరిగి కిడ్నాపర్స్ కోసము ముమ్మర గాలింపులు జరుపుతుండగా నిన్నటి దినము 29.06.2023 ఈ కేసులో ముద్దాయిల గురించి రాబడిన సమాచారము మేరకు గుత్తి మండలము బాట సుంకులమ్మ గుడి వద్ద సురేశ్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతను తాను చేసిన నేరము గురించి ఒప్పుకొని మిగిలిన ముద్దాయిల కోసము అనంతపురము జిల్లా చెన్నేకొత్తపల్లి మండలము, కోన మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళు రస్తాలో కర్నాటక రాష్ట్రనికి చెందిన  శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, G.N. రంజిత్ కుమార్, మరియు ఆంద్ర రాష్ట్రము లోని ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందిన  రవి కుమార్, రంజిత్ కుమార్, వాళ్ళను అదుపులోనికి తీసుకొని విచారించగ వాళ్ళు కూడా తాము చేసిన నేరమును అంగీకరించగ వారిని అరెస్టు చేసి, ఈ నేరము చెయ్యడానికి వారి వాటగా రాబడిన 40 లక్షల రూపాయల నగదును మరియు నేరము చేయు క్రమములో ఉపయోగించిన నాలుగు కార్లను మూడు సెల్ ఫోన్ లను మరియు ఒక కత్తిని స్వాదినము చేసుకోవడమైనది,తరువాత మిగిలిన ముద్దాయిల కోసం రాజశ్రీ నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు డోన్ DSP శ్రీ Y.శ్రీనివాసరెడ్డి గారి పర్యవేక్షణలో, బేతంచెర్ల సి‌ఐ G.ప్రియతమ్ రెడ్డి గారు, SI S.శివ శంకర్ నాయక్, ప్యాపిలి SI CM.రాకేశ్, SI లు M.నరేశ్, K.జగదీశ్వర రెడ్డి మరియు పోలీస్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టడం జరిగింది. విచారణలో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  మిగిలిన పై ముద్దాయిలను  ఈ దినం అనగా 20.10.2023 వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా గుత్తి మండలం, గుత్తి టౌన్ కు ఊరి బయటగల టోల్ గేటు కు సుమారు అర్ధ కిలోమీటర్ దూరం లో బెంగలూరు నుండి హైదరాబాద్ పోయే NH-44 High Way పక్కన గల మూతబడిన పెట్రోల్ బంకు వద్ద  అరెస్ట్ చేయడమైనది.A-1 ముద్దాయి వద్ద నుండి తన వాటాకు సంబంధించిన Rs 92,56,000/- రూపాయలు మరియు A-3 వాటాకు సంబందించిన 75 లక్షల రూపాయలు, A-2 ముద్దాయి వద్ద నుండి అతని వాటాకు  సంభందించి Rs 95,04,200/-, A-4 ముద్దాయి వద్ద నుండి Rs 3,53,800/- మొత్తము Rs 2,66,14,000/- ( మొత్తం రెండు కోట్ల అరవై ఆరు లక్షల  రూపాయలు  స్వాదీన పరచుకొనడమైనది.

Ø  ఈ కేసులో ఇప్పటివరకు బాధితులు కిడ్నాపర్స్ కు ఇచ్చిన 4 కోట్ల రూపాయలలో మొత్తం Rs 3,06,14,000/- (మూడు కోట్ల ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయలు) స్వాదీన పరచుకొనడమైనది. 

ఈ కేసులో ముద్దాయిలు కేవలము తాము త్వరగా ఆర్ధికముగా స్తిరపడాలనే ఉద్దేశ్యముతో బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అయిన బనగానపల్లే కు చెందిన వినాయక రెడ్డిని  ఎంచుకొని  అతని ఇంటి వద్ద రెక్కి చేసి అతని కదలికలు గమనించి పక్క పధకం ప్రకారము 05.06.2023 నాడు వినాయక రెడ్డి తన సొంత వాహనములో బేతంచెర్ల వైపు పోవడం గమనించి, తాము ముందుగా అనుకున్న పధకం ప్రకారము బేతంచెర్ల మండలము సీతరామపురం మెట్ట దాటిన తరువాత వినాయక రెడ్డి ని తాము తెచ్చుకున్న వాహనాలలో అడ్డగించి వినాయక రెడ్డిని మరియు అతని కొడుకు భరత్ కుమార్ రెడ్డి లను మరియు కిడ్నాప్ చేయుటకు ప్రయత్నించగా అడ్డము వచ్చిన డ్రైవరు సాయినాథ్ రెడ్డి ని కూడా కిడ్నాప్ చేయడమైనది.        ఈ కేసు చేధనలో ప్రతిభ కనపరిచిన, డోన్ DSP Y.శ్రీనివాసరెడ్డి గారిని, బేతంచెర్ల CI G.ప్రియతమ్ రెడ్డిని, SI S.శివ శంకర్ నాయక్, SI లు CM.రాకేశ్, M.నరేశ్, K.జగదీశ్వర రెడ్డి, పోలీసు సిబ్బంది అయిన దస్తగిరి,గురుబాబు, శ్రీకాంత్,  సురేష్, చిన్న వెంకటేశ్వర్లు, రాజు నాయక్ మాదవ కృష్ణుడు,తిరుపాల్ నాయక్ , CDR టీమ్ శేఖర్ రెడ్డి, మధు సుధాకర్, రాజేశ్వర రెడ్డి,  PRO చెన్నయ్య,   డ్రైవర్ నాయుడు ,  హోం గార్డ్స్ విశ్వేశ్వరయ్య లను నంద్యాల జిల్లా SP గారు అభినందించారు. అలాగే ఈ కేసులో త్వరిత గతిన దర్యాప్తు పూర్తిచేసి ఛార్జ్ షీట్ వేసి త్వరిత గతిన ట్రయిల్ నడిపించి ముద్దాయిలకు శిక్షపడేలా చేస్తామని నంద్యాల జిల్లా SP గారు తెలుపడమైనది.

About Author