NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివేక హ‌త్యకేసులో కీల‌క స‌మాచారం.. సీబీఐ విచార‌ణ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్యకేసులో సీబీఐ విచార‌ణ 30 రోజు కొన‌సాగుతోంది. నెల‌రోజులుగా సీబీఐ అధికారులు నిర్వరామంగా అనుమానితుల్ని విచారిస్తున్నారు. ఇప్పటికే ప‌లువురిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు… వారి నుంచి కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. వివేక హ‌త్యకేసు సాక్ష్యాలు తారుమారు చేశార‌ని సిట్ అరెస్టు చేసిన ఎర్రగంగిరెడ్డి తో పాటు వివేక పీఏ కృష్ణారెడ్డి, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ హిద‌య‌తుల్లా, డ్రైవ‌ర్ ప్రసాద్, వైసీపీ కార్యక‌ర్త కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ను సీబీఐ అధికారులు నిన్న సాయంత్రం నుంచి రాత్రి వ‌ర‌కు పులివెందుల అతిథి గృహంలో విచారించారు. మ‌రోసారి ఈ రోజు క‌డ‌ప కేంద్ర కారాగారంలోని గెస్ట్ హౌస్ లో విచార‌ణ చేస్తున్నారు.

About Author