సీట్ బెల్ట్ పై అమెజాన్ కు కీలక ఆదేశాలు
1 min readపల్లెవెలుగువెబ్ : పారిశ్రామికవేత్త, షాపూర్జీ పల్లోంజీ గ్రూపు వారసుడైన సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సీటు బెల్ట్ విషయమై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. సీట్ బెల్ట్ ధరించకపోతే హెచ్చరించే అలారమ్ వ్యవస్థను జామ్ చేసే పరికరాలను విక్రయించొద్దంటూ అమెజాన్ ను కేంద్ర సర్కారు ఆదేశించింది. అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పై మెటల్ క్లిప్పులను విక్రయిస్తోంది. వీటిని సీట్ బెల్ట్ కు పెట్టడం వల్ల అలారమ్ మోగకుండా ఉంటుంది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే అలారమ్ మోగుతూ ఉంటుంది. ఈ సౌండ్ నచ్చని వారు ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసి వాడుతున్నారు.