రాజకీయ పార్టీ ప్రతినిధులతో కీలక సమావేశం
1 min read– ఓటర్ల ఇంటింటి సర్వే మరియు ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: గుర్తింపుపొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కొరడమైనది- కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఎ.భార్గవ్ తేజ I.A.S. కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, శ్రీ ఎ. భార్గవ్ తేజ I.A.S., ఎన్నికల ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.భారత ఎన్నికల సంఘము వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభ, శాసన సభ స్థానాలకు జరుగనున్న 2024-సాధారణ ఎన్నికలకు అవసరమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యాచరణ ప్రణాళిక షెడ్యూల్ జారీ చేసియున్నారు.కావున ఇంటింటి సర్వే మరియు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం – 2024 విజయవంతంగా సాగేందుకు మరియు ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు గుర్తింపుపొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని, ఈ ప్రక్రియలో వారు కూడా భాగస్వామ్యుల అయ్యేలా తమ బూత్ స్థాయి ఏజంట్లను నియమించుకోవాలని,సదరు బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలసిందిగా,ప్రస్తుతము ఉన్న ఓటర్ల జాబితాలో యేమైనా ఇంటినెంబర్లు / ఓటర్ల వయసు/పుట్టినతేదీలు / ఒకే ఇంటి నందు ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉండుట లాంటి పొరపాట్లను గమనించిన యెడల వాటిని సంబంధిత బి.యల్.ఓ./ఏ.ఈ.ఆర్.ఓ / ఈ.ఆర్.ఓ / జిల్లా ఎన్నికల అధికారి వారి దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు. ఈ సమావేశంలో కర్నూలు అర్బన్ MRO శ్రీమతి విజయశ్రీ , నగర పాలక టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి శ్రీ మోహన్ గారు, అధికారులు గుర్తింపుపొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.