PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిజాబ్ పై కవిత కీలక వ్యాఖ్యలు

1 min read

పల్లెవెలుగువెబ్ : హిజాబ్ విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలని.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. తాను చేతితో రాసిన కవితను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు… హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందని కవిత పేర్కొన్నారు. ‘‘ఎలా ఉండాలి? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాయిష్టాలకే వదిలేయాలన్నారు. హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..మతమేదైనా సరే.. మనమంతా భారతీయులమేనని అన్నారు.

         

About Author