సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పారు. మంత్రి వర్గం నుంచి తప్పించిన వారు పార్టీ కోసం పని చెయ్యాలని జగన్ సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టు వెల్లడించారు. కొంత మంది మాత్రం మంత్రి పదవిలోనే ఉంటారని సీఎం జగన్ తెలిపారు. జగన్ వ్యాఖ్యలతో ఎవరికి మంత్రి పదవి ఊడుతుందో.. ఎవరికి ఉంటుందో అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.