ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కీలక అడుగులు!
1 min read
ఆలూరు న్యూస్ నేడు: కర్నూల్ కలెక్టర్ శ్రీ రంజిత్ భాష ని శనివారం కలెక్టరేట్ లో ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ప్రధానంగా చర్చించిన అంశాలు:1. పందికోన రిజర్వాయర్ కోసం అవసరమైన 250 కోట్లు, (ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో)2. త్రాగునీటి సమస్యలు (జల జీవన్, అమృతధార పథకాల ద్వారా)3. పంచాయతీ నిధుల సక్రమ వినియోగం4. గ్రామ రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ5. క్రమశిక్షణ రాజకీయాల ద్వారా అభివృద్ధి లక్ష్యంకలెక్టర్ రంజిత్ భాష ని ఆలూరు నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ప్రత్యేక దృష్టి చూపాలని కోరారు.అలానే శ్రీ తెర్నేకల్ వెంకప్ప గత వారం డిప్యూటీ సీఎం ఆఫీస్ అధికారులతో విజయవాడలో సమావేశమై, నియోజకవర్గానికి అవసరమైన బడ్జెట్ గురించి చర్చించారు. త్వరలో మళ్లీ విజయవాడ వెళ్లి మరింత స్పష్టతతో చర్చించున్నారని వారు తెలిపారు.