కేజీ మిఠాయి ధర 11,000 !
1 min readపల్లెవెలుగు వెబ్: మహారాష్ట్రలోని అమరావతిలో ఓ స్వీట్ షాపు ‘సువర్ణ కలశ్’ పేరుతో ఓ స్వీట్ ను తయారు చేసింది. పూర్తీగా 24 క్యారెట్ల బంగారు పూతతో దీనిని తయారు చేయడం విశేషం. మొత్తం 12 కేజీల సువర్ణ కలశ్ తయారు చేసినట్టు దుకాణం యజమానులు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా రాజస్థాన్ నుంచి నిపుణులను రప్పించినట్టు తెలిపారు. సోమవారం నాటికి ఏడు కేజీల వరకు విక్రయాలు పూర్తైనట్టు తెలిపారు. ఒక కిలో సువర్ణ కలశ్ ధర 11,000.