NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేజీఎఫ్ చాప్ట‌ర్ -2 ఫ‌స్ట్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 సినిమా ఫస్ట్‌ రివ్యూ అంటూ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు ఐదు స్టార్లు ఇచ్చాడు . ఓవర్‌సీస్‌ సెన్సార్‌ బోర్డు సభ్యుడిని అని తనకు తాను డప్పు కొట్టుకునే ఉమైర్‌ సంధు సినిమా రిలీజ్‌కు ముందే కేజీఎఫ్‌2 చూశానంటూ సోషల్‌ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. కేజీఎఫ్‌ కేవలం కన్నడ బ్లాక్‌బస్టర్‌ మాత్రమే కాదని.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ మూవీ అని ప్రశంసల జల్లు కురిపించాడు. ‘కేజీఎఫ్‌ 2 కన్నడ ఇండస్ట్రీకి కిరీటం లాంటింది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు.. ప్రతి సీన్‌ అదిరిపోయింది. యాక్షన్‌ సీన్స్‌, సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. డైలాగ్స్‌ చాలా షార్ప్‌గా, ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. బీజీఎం అయితే అదిరిపోయింది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలో ప్రతి ఒక్కరి నటన చాలా టెరిఫిక్‌గా ఉంది. కేజీఎఫ్‌ 2 కేవలం శాండల్‌వుడ్‌ బాక్ల్‌బస్టర్‌ మాత్రమే కాదు.. ఇదొక వరల్డ్‌ క్లాస్‌ మూవీ. యశ్‌, సంజయ్‌ దత్‌లు తమదైన నటనతో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌ అయితే అందరికి షాకిస్తుంది’అని ఉమైర్‌ సంధు చెప్పుకొచ్చాడు.

                          

About Author