PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేజీఎఫ్ గరుడ తెలుగు సినిమాల్లో..

1 min read

సినిమా డెస్క్​ : సంచలనాత్మక కన్నడ మూవీ ‘కేజీఎఫ్’ లో గరుడ అనే విలన్‌ పాత్రతో మెప్పించిన రామచంద్రరాజుకి వరుస తెలుగు సినిమా ఆఫర్లు వరిస్తున్నాయి. ‘మహాసముద్రం’లో దనుంజయ్ అనే పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్న రాజు, మరికొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా వస్తున్న ‘భళా తందనాన’లో విలన్ రోల్‌ చేస్తున్నాడు. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తనపాత్రని రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. తను ‘ఆనంద్ బాలి’ అనే క్యారెక్టర్‌‌ పోషిస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. చైతన్య దంతులూరి ఈ చిత్రానికి దర్శకుడు. కేథరిన్ థ్రెస్సా హీరోయిన్. రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇదిగాక ‘వైరం’ అనే చిత్రంలో డేవిడ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు గరుడ రామ్. ఈ మూవీ ఫస్ట్ లుక్ కూడా నిన్న విడుదల చేశారు. సాయి శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జె.ఎమ్.కె నిర్మిస్తున్నారు. మొత్తానికి వరుస విలన్ రోల్స్ లో టాలీవుడ్ లోనూ అదరగొట్టనున్నాడు ఈ కన్నడ యాక్టర్.

About Author