PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసెంబ్లీ గేటు పై ఖ‌లిస్థాన్ జెండాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్‌ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్‌ జెండాలు ప్రత‍్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం జెండా చూసిన వెంటనే తొలగించామన్నారు. అయితే, ఈ జెండాలను పంజాబ్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

                                       

About Author