కెనడాలో ఖలిస్థాన్ రెఫరెండం !
1 min readపల్లెవెలుగువెబ్: కెనడాలో ఖలిస్థాన్ అనుకూల శక్తుల కార్యకలాపాలు పెరుగుతుండడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చేనెల 6న ఒంటారియాలో ఖలిస్థాన్‌పై రెండో విడత ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరపాలన్న ప్రయత్నాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని అడ్డుకోవాలని కోరుతూ కెనడా ప్రభుత్వానికి ‘డెమార్షే’ను జారీ చేసింది. ఏదైనా అంశంపై అధికారిక వైఖరిని స్పష్టం చేస్తూ విదేశీ ప్రభుత్వానికి సమాచారాన్ని పంపించడాన్ని డెమార్షేగా వ్యవహరిస్తుంటారు. ఖలిస్థాన్ ఏర్పాటుపై గత నెల 18న బ్రాంప్టన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరగడం గమనార్హం.