ఘనంగా ప్రారంభమైన ఖేలో ఇండియా మహిళా రగ్బీ క్రీడా పోటీలు
1 min readరగ్బీ లో జిల్లా క్రీడాకారులు రాణించాలి
రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రగ్బీ లాంటి నూతన క్రీడల్లో జిల్లా క్రీడాకారులు రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎదగాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పచ్చిక బయలు మైదానంలో ఏర్పాటు చేసిన రగ్బీ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజె.రెడ్డి అధ్యక్షత వహించగా పాఠశాల ప్రిన్సిపాల్ జస్వితన గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఖేలో ఇండియా ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో నిర్వహించే రగ్బీ పోటీలతో జిల్లాకు మాహర్దశ పట్టిందన్నారు. రగ్బీ పోటీల విజేతలకు కేంద్ర ప్రభుత్వం క్రీడా విభాగం ద్వారా విజేతలకు లక్షల రూపాయల నగదు బహుమతులను ప్రకటించడం హర్షణీయమన్నారు. క్రీడలను అభివృద్ధి చెసేoదుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజీ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణతో తాము ఎంచుకున్న రంగంలో రాణించాలన్నారు. ప్రభుత్వాలతోపాటు తమలాంటి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం కూడా క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. అంతకుముందు రగ్బీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారిగా రగ్బీ క్రీడకు ఖేలో ఇండియా ద్వారా ప్రోత్సాహం అందించడం అభినందనీయం అన్నారు. జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ రగ్బీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఖే లో ఇండియా టోర్నమెంట్ అబ్జర్వర్లుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జ్యోతి పంచల్, చంద్రశేఖర్ కార్తికేయన్, రఘు ఇండియా నుంచి వికాస్ నోయల్ అమిత్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షులు సురేంద్ర, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు గంగాధర్, దాసరి సుధీర్, చిట్టిబాబు, ఎం. ఎం .డి భాష, సౌత్ ఇండియన్ రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్ నోయల్ ,రెఫరీస్ బోర్డు కోఆర్డినేటర్ వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభానికి ముందు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన సామరస్కృతిక కార్యక్రమం పలువురిని అలరించింది.