NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ కిక్​’ కొడితే.. పతకమే..

1 min read

రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో ప్రతిభ చాటండి

  • త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమి  చైర్మన్​ డా. త్రినాథ్​

కర్నూలు, న్యూస్​ నేడు: రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు బంగారు పతకాలు తీసుకురావాలని ఆకాంక్షించారు త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమి  చైర్మన్​ డా. త్రినాథ్​ . కర్నూలు నగరం బి క్యాంపులోని శ్రీ లక్ష్మీ వెంకటేష్​ కళ్యాణ మండపంలో శనివారం రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలు  ఆసక్తి కరంగా జరిగాయి.  వైసీపీ కర్నూలు జిల్లా అద్యక్షుడు ఎస్వీ మోహన్​ రెడ్డి సతీమణి ఎస్వీ విజయ మనోహరి, టీడీపీ నాయకులు కేవీ సుబ్బా రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. పోటీలో ఎనిమిది జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అన్ని ఈవెంట్లలోనూ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్బంగా డా. త్రినాథ్​ మాట్లాడుతూ కిక్​ బాక్సింగ్​ లో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడు అండగా ఉంటానన్నారు.  కార్యక్రమంలో కిక్​ బాక్సింగ్​ త్రినాథ్​ అకాడమీ కోచర్​ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *