NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిక్​ బాక్సర్లను ప్రోత్సహిద్దాం..

1 min read

ఏప్రిల్​ 5న జరిగే రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలను విజయవంతం చేద్దాం

  • త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమి అధ్యక్షులు, అమ్మ హాస్పిటల్​ అధినేత డాక్టర్ త్రినాథ్

కర్నూలు, న్యూస్​ నేడు: ఏప్రిల్ 5 నుంచి 6 వరకు కర్నూలు నగరంలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్,సీనియర్ విభాగాలలో కిక్ బాక్సింగ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కిక్ బాక్సింగ్ సంఘం కార్యదర్శి నరేంద్ర ఆచారి  తెలిపారు. ఈ సందర్భంగా  శనివారం నగరంలోని త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమిలో రాష్ట్ర స్థాయి  కిక్ బాక్సింగ్ పోటీలకు సంబంధించి బ్రోచర్ ను త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమి అధ్యక్షులు డాక్టర్ త్రినాథ్, డాక్టర్ శశివర్ధన్లు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం అందరి బాధ్యత అన్నారు.కర్నూల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. క్రీడాకారుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్న డా.  త్రినాథ్​… రాష్ట్ర స్థాయి పోటీలో కర్నూలు కిక్​ బాక్సర్లు విజయం సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *