NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన అవసరం…

1 min read

బీపీ,షుగర్​, ఊబకాయం వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాల్సిందే..

  • ప్రారంభదశలో చికిత్స కు వస్తే.. సేఫ్​..
  • నెఫ్రాలజిస్ట్​ డా. రవికుమార్​
  •  ‘ జెమ్​ కేర్​ కామినేని’లో.. కిడ్నీ స్ర్కీనింగ్​ కు స్పెషల్​ ప్యాకేజీ

కర్నూలు,  న్యూస్​ నేడు: కిడ్నీల ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు  జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ ప్రముఖ నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​.  కిడ్నీలను సంరక్షించుకునేందుకు ‘ జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ లో కిడ్నీ డే వేడుకలు నిర్వహించారు.  హాస్పిటల్​ సీఈఓ, ఎం.డి డా. చంద్ర శేఖర్​  నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​, డా. సతీష్​ కేక్​ కట్​ చేసి హాస్పిటల్​ సిబ్బందికి, రోగులకు, వారి బంధువులకు పంచారు. ఈ సందర్భంగా కిడ్నీ లను కాపాడుకునేందుకుగాను స్క్రీనింగ్​ టెస్టుల కోసం రూ.3180  అయ్యే ఖర్చు కు రూ.499 మాత్రమే ప్రత్యేక ప్యాకేజికి సంబంధించిన వోచర్​ను విడుదల చేశారు.  అనంతరం జెమ్ కేర్​ కామినేనిలో 35 మంది డయాలసిస్ట్​ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో రెగ్యులర్​ పేషెంట్లను సన్మానించారు. ఈ సందర్భంగా నెఫ్రాలజిస్ట్​ డా. రవి కుమార్​ మాట్లాడుతూ మందు, మద్యం, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండాలని, ప్రతి రోజు వ్యాయామం చేస్తే  కిడ్నీల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వ్యాధిగ్రస్తులకు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జెమ్​ కేర్​ కామినేని హాస్పిటల్​ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ మార్చి 13 నుంచి ఏప్రిల్​ 13 వరకు మాత్రమే ఉంటుందన్నారు. ప్యాకేజీలో భాగంగా ఆర్​బిఎస్​, సిబిపి, సియూఈ, సెరమ్​ క్రిటినిన్​, అబ్​డమెన్​ అల్ర్టా సౌండ్​ తోపాటు నెఫ్రాలజి వైద్యులు ఉచితంగా ఓపీ చూస్తారని ఈ సందర్భంగా  నెఫ్రాలజిస్ట్​లు డా. రవి కుమార్​, డా. సతీష్​ వెల్లడించారు. కార్యక్రమంలో  డైరెక్టర్​ ఆర్థో పెడిక్​ వైద్యులు డా. రవి బాబు ,  ఎమర్జెన్సీ హెడ్​ డా. రామ్మోహన్​, న్యూరాలజిస్ట్​ డా. నిషాన్ ,  సీఈఓ డా. గణేష్​ ,  ఏజీఎం డా. కృష్ణ,  నదీమ్​​ జిఎం ఆపరేషన్ ,  ​రమణ డిజే మార్కెటింగ్​ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *