ఆ ఎమ్మెల్యేను చంపెయ్.. కోటి ఇస్తా !
1 min readపల్లెవెలుగు వెబ్: కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు గోపాలక్రిష్ణ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ వ్యక్తితో మాట్లాడుతూ… యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాధ్‌ను హత్య చేయాలని కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో గోపాలక్రిష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యేని(విశ్వనాథ్) ఫినిష్ చేయ్. చంపేయ్. నీకు కోటి రూపాయలు ఇస్తాను. దీని గురించి ఎవరికి తెలియదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుంది’’ అని గోపాలక్రిష్ణ అవతలి వ్యక్తికి చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశం పై దర్యాప్తు ప్రారంభించారు.