వారిని హతమార్చండి.. అమెరికా ఆదేశం !
1 min readపల్లెవెలుగు వెబ్ : కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. దాడుల్లో అమెరికా సైనికులు చనిపోవడం పై బైడెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సైనికులు ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమార్చాలని అమెరికా ఆర్మీని బైడెన్ ఆదేశించారు. మృతి చెందిన అమెరికా సైనికుల్ని హీరోలుగా అభివర్ణించారు. ఈనెల 31 కల్లా ఆప్ఘన్ నుంచి అమెరికా సైనిక బలగాలను ఉపసంహరించుకుంటామని బైడెన్ మరోసారి ప్రకటించారు.