కిలో కొర్రలు.. ఎన్ని గింజలుంటాయి !
1 min readపల్లెవెలుగు వెబ్: కొర్రలు.. తృణధాన్యాల విభాగానికి చెందినవి. ఒకప్పుడు కొర్రలు బాగా తినేవారు. పండించేవారు. చూడటానికి చాలా సన్నగా ఉంటాయి. రాగుల కంటే కొంత పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. కిలో కొర్రలకు ఎన్ని గింజలు ఉంటాయో చెప్పడం సులువు కాదు. లెక్కించడం అంత తేలిక కాదు. కానీ కర్ణాటకకు చెందిన యువకుడు కొర్రలను లెక్కించేశాడు. కిలోకు ఎన్ని కొర్ర గింజలు ఉంటాయో లెక్కతో సహా చెప్పాడు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు. కర్ణాటకకు చెందిన అభిషేక్ 87 గంటల 35 నిమిషాల్లో కిలో కొర్రలను లెక్కించాడు. మొత్తం 4,04,884 కొర్ర గింజలు ఉన్నట్టు తెలిపాడు. దీంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు.