PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

– 25 కేజీల జత గంప టమోటా రూ.50
–ఆందోళనలో రైతులు
పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కిలో టమోటా ధర పది పైసలకు పడిపోయింది.25 కేజీల జత గంపల టమోటా కేవలం 50 రూపాయలు పలకడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. దళారీ వ్యవస్థ రాజ్యమేలడంతో రైతు ఆరుగాలం కష్టించిన పంటకు కనీస ధర కూడా రాలేకపోయింది. టమోటా పంటను కోసి మార్కెట్ కు తీసుకురావడానికి గంప కు వంద రూపాయల పైన ఖర్చు అవుతుంది. కానీ జత గంపలు 50 రూపాయలకు మించి ధర పలకడం లేదు. కొందరు రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. మార్కెట్ కు తరలించినప్పటికీ టమోటా కు కనీస ధర రాకపోవడంతో అక్కడే మోటార్లను పార పోస్తున్నారు.

ఆందోళన చేసిన రైతు సంఘాలు
పత్తికొండ మార్కెట్ యార్డులో టమోటా ధర పూర్తిగా పతనం కావడంతో ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో టమోటా రైతులతో ఆందోళన చేపట్టింది. విస్తారంగా ఈ ప్రాంతంలో టమోటా పంటలు సాగుతుందని, కానీ పంటకు సరైన గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రాంచంద్రయ్య మాట్లాడారు. పత్తికొండ ప్రాంతంలో టమోటా రైతుల పరిస్థితి ఆనాటికి దిగజారుతుందని ,ప్రభుత్వం నూట రైతులు తక్షణమే ఆదుకోవాలన్నారు. ప్రభుత్వమే టమోటా పంటను కనీస ధరలకు కొనుగోలు చేయాలని కోరారు .ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని నాయకులు ఎన్నికల ముందు చెబుతున్నారే తప్ప చేసిందేమీ లేదని అన్నారు .ఇప్పటికైనా ఈ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి టమోటా రైతాంగాన్ని ఆదుకోవాలని వారు కోరారు.


About Author