NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

11 మంది పేకాట రాయళ్ళు అరెస్టు

1 min read

– 5 బైకులు, రూ. 25,360  స్వాధీనం 

పల్లెవెలుగు వెబ్​,మిడుతూరు: పేకాట ఆడుతున్న స్థావరంపై మిడుతూరు ఎస్సై మారుతి శంకర్ సిబ్బందితో కలిసి దాడి చేశారు.వివరాలు ఈవిధంగా ఉన్నాయి.  మండల పరిధిలోని తలముడిపి గ్రామ పొలిమేరలో గురువారం రాత్రి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తలముడిపి గ్రామానికి చెందిన సమీప పొలాల్లో పేకాట ఆడుతుండగా 11 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై మారుతి శంకర్ తెలిపారు.అదే విధంగా వారి వద్ద నుంచి 25,360 నగదు మరియు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పట్టుబడిన వారిలో గడివేముల గ్రామానికి చెందిన షేక్షావలి,షేక్ చాంద్ బాష,టి. రాముడు,ఏ.పుల్లయ్య, తలముడిపి గ్రామానికి చెందిన ఏ.సోమన్న,షేక్ రహంతుల్లా, గడివేముల మండలం బూజు నూరు గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాసరెడ్డి,పి.వెంకటరమణ, మిద్దె నారాయణ,చిందుకూరు గ్రామానికి చెందిన సింగారెడ్డి చక్రపాణిరెడ్డి,మంచాలకట్ట గ్రామానికి చెందిన అప్పిపోగు. రాజు అను వీరి 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

About Author