జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : విశాఖ జిల్లా ఎస్. రాయవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అడ్డురోడ్డు కూడలి వద్ద పోలీసులు, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి వర్గీయులు ఆందోళనకు దిగారు. జగన్ ముద్దు.. ఎమ్మెల్యే వద్దు అంటూ నినాదాలు చేశారు. పెద్ద గుమ్మలూరు నుంచి అడ్డురోడ్డు కూడలి వరకు 1000 మంది వైకాపా కార్యకర్తలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం పోలీసులను దాటుకుని వైకాపా నాయకులు జాతీయ రహదారి పై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.