కస్తూర్బా బాలికల ..ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలో ని వంటశాల తనిఖీ
1 min read
నంద్యాల, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మన్ చిత్త విజయ ప్రతాపరెడ్డి నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా రాజశ్రీ జిల్లా కలెక్టర్ నంద్యాల వారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. గత రెండు రోజులనుండి (09.04.2025 మరియు 10.04.2025 తేదీలలో) బనగానపల్లె పట్టణం లోని కస్తూర్బా బాలికల ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలోని వంటశాలను తనిఖీ చేసి, మెనూను పరిశీలించారు. మరియు ఎస్సీ బాలికల వసతి గృహం, బి.సి బాలికల వసతి గృహాలను తనిఖీ చేసి కూరగాయలు, బియ్యం, కంది పప్పు తదితర వస్తువుల నాణ్యతను పరిశీలించారు. అలాగే హాస్టల్ లో జరుగుతున్న ఆభివృద్ది పనులు, మరమత్తు పనులను పరిశీలించారు. మరియు నంద్యాల పట్టణంలోని క్రాంతి నగర్ లోని మోడల్ స్కూల్ ను తనిఖీ చేసి భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి నియమ నిభందనల ప్రకారం విధ్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అంధించాలని సంబందిత ప్రిన్సిపాల్ కు సూచించడమైనది. అదే విధంగా నంద్యాల పట్టణంలోని దేవనగర్ లో వున్న ఎస్సీ హాస్టల్ -1 ను సందర్శించి తనిఖీ చేసి భోజన నాణ్యత మరియు మెనూను సక్రమంగా పాటిస్తున్నారా అని హాస్టల్ నందలి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గం మరియు నంద్యాల పట్టణంలోని SC, ST, BC వసతి గృహాలను తనిఖీ చేసి కూరగాయలు, బియ్యం, కంది పప్పు తదితర వస్తువుల నాణ్యతను పరిశీలించారు. తదుపరి ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో మెనూ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా 9490551117 అనే నెంబరుకు వాట్సాప్ చేసి సమాచారం అందజేయాలని సూచించడమైనది. నాణ్యమైన భోజనం అందించి మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని సంబంధిత అధికారులను కోరడమైనది. ఆయన వెంట సివిల్ సప్లై అధికారులు, ఇన్‌ఛార్జ్ డిఎస్ఓ బి. రాజు, ఏఎస్ఓ జె. రవి బాబు, ఉప-తహశీల్దార్ కె.యల్.వి.ప్రసాద్ రావు మరియు లీగల్ మెట్రోలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.
