గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకోవాలి..
1 min read– సొసైటీ చైర్మన్ అల్లి శ్రీరామమూర్తి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి అన్నారు, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల లో భాగంగా మంగళవారం సహకార సొసైటీ నందు అలాగే గ్రంథాలయం చెన్నూరు నందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ, గ్రంథాలయాలు విజ్ఞాన బండారాలని అన్నారు, ఇందులో మానసిక విలాసానికే కాకుండా మనలోని మేధస్సును పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు, అలాగే పిల్లల సాహిత్య, సాంస్కృతిక అంశాలకే కాకుండా పిల్లల మనోవికాసానికి, సమగ్ర ఎదుగుదలకు ఎంతో ఉంటాయని ఆయన తెలియజేశారు, తల్లిదండ్రులు పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా సాటి మనిషిని ప్రేమించే తత్వాన్ని తెలియజేయాలని ఆయన అన్నారు, అందుకే మనమందరం నవంబర్ 14న జవహర్లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని, ఆయన బాలలు అంటే అంత ప్రేమని, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా ఆయన బాలల పట్ల ప్రేమ వాచ్యాల్యాలు కురిపించే వారని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, వారిష్, సంపూర్ణ రెడ్డి, సాదు కిషోర్, గంగులయ్య, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.