NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముగిసిన విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర

కర్నూలు :విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచేందుకు వారిని విహార విజ్ఞాన యాత్రలకు పంపించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షలు పర్యటనలకు సన్నాహాలు చేశాయి. జిల్లాలో ప్రాథమిక స్థాయిలో 150 మంది సెకండరీ స్థాయిలో  147 మందిని విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభగల వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెకండరీ విద్యార్థులకు కుప్పంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషేన్ లోని 32 సైన్స్ ప్రయోగశాలలను సందర్శించడం జరిగింది. వాటిలో భౌతిక ,  రసాయన శాస్త్రం, జీవశాస్త్రం తదితర ప్రయోగశాలలను సందర్శించి విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించే విధంగా ఉన్నాయని పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సెకండరీ లెవల్ లో రెండవ రోజు బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ సైన్స్ మ్యూజియంను సందర్శించడం జరిగింది ఈ సైన్స్ మ్యూజియంలో విజ్ఞాన శాస్త్రమునకు సంబంధించిన అన్ని నమూనాలను విద్యార్థులు చూడడం జరిగింది ఈ విజ్ఞాన నమూనాలతో విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం వైపు మరింత మక్కువ పెంచి విద్యార్థి దశ నుండే విద్యార్థులకు శాస్త్రవేత్తలుగా పునాది వేయడం జరుగుతుందని అధికారులు చెప్పడం జరిగింది ఈ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రలో విజయవంతం కావడానికి జిల్లా విద్యాశాఖ అధికారి గారు మరియు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ టి శ్రీనివాస్ గారు చక్కని ప్రణాళికను తయారుచేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కలుగజేసి ఈ విజ్ఞాన విహార యాత్రను విజయవంతం చేశారని సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ షేక్ రఫీ జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ గారు చెప్పడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *