PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అల్ట్రాసౌండ్ ప‌రిజ్ఞానంపై కిమ్స్ ఐకాన్ ఆస్ప‌త్రిలో వ‌ర్క్ షాప్‌

1 min read

 ​100 మందికి పైగా వైద్య‌నిపుణుల హాజ‌రు

విశాఖపట్నం: వైద్యవృత్తిలో నిరంత‌ర అధ్యయ‌నం అవ‌స‌రం. ఎప్పటిక‌ప్పుడు వ‌స్తున్న స‌రికొత్త సాంకేతిక మార్పులు చికిత్స‌ల తీరును గ‌ణ‌నీయంగా మారుస్తున్నాయి. కొత్త సాంకేతిక‌త‌పై వైద్య నిపుణుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ (పోక‌స్‌) అనే అంశంపై విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో రోజంతా ఒక వ‌ర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్యంగా క్రిటిక‌ల్ కేర్ విభాగంలో అల్ట్రాసౌండ్ టెక్నాల‌జీని ఉప‌యోగించ‌డంపై ఎన‌స్థీషియాల‌జిస్టులు, ఇంటెన్సివిస్టులు, ఎమ‌ర్జెన్సీ ఫిజిషియ‌న్లతో పాటు పీజీ వైద్య విద్యార్థుల‌కు కూడా శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన‌ ఈ వ‌ర్క్ షాప్ లో వివిధ ఆస్పత్రులు, వైద్య సంస్థల నుంచి 50 మందికి పైగా హాజ‌ర‌య్యారు. పోక‌స్ విష‌యంలో ప‌రిజ్ఞానంతో పాటు నైపుణ్యం ఉన్న వైద్యులు ఈ సెష‌న్లను నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ప్రాథ‌మిక అల్ట్రాసౌండ్ ఫిజిక్స్, ఇమేజ్ ఎక్విజిష‌న్‌, ఇంట‌ర్‌ప్రెటేష‌న్‌, గుండెకు, ఊపిరితిత్తుల‌కు, ఉద‌ర భాగానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎలా చేయాలి, న‌రాల విష‌యంలో ఎలా చేయాల‌నే విష‌యాల‌ను వివ‌రించారు. ముందుగా ప్రత్యేకంగా రూపొందించిన బొమ్మల‌పై త‌మ నైపుణ్యాల‌ను ప్రద‌ర్శించి, త‌ర్వాత నిపుణులైన వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో కొంద‌రు రోగుల‌కూ స్కానింగ్ చేయ‌డానికి అవ‌కాశం క‌ల్పించారు.

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో క్రిటిక‌ల్ కేర్ విభాగానికి చెందిన లీడ్ క‌న్సల్టెంట్ డాక్టర్ ఎం.ర‌వికృష్ణ , డా. మల్ల హరిప్రసాద్,  డా. ఆర్.వి. గణేష్, డా. యశ్విని మాట్లాడుతూ, ‘‘అల్ట్రాసౌండ్ టెక్నాల‌జీని ఉపయోగించ‌డం క్రిటిక‌ల్ కేర్ వైద్యంలో అంత‌ర్గ‌త భాగం అయిపోయింది. రోగుల‌కు ఉన్న స‌మ‌స్య ఏంట‌న్న విష‌యాన్ని అత్యంత క‌చ్చితంగా, త్వర‌గా తెలుసుకోవ‌డానికి, రోగి ప‌రిస్థితిని రియ‌ల్ టైంలో (అప్పటిక‌ప్పుడే) ప‌ర్య‌వేక్షించ‌డానికి, వాస్క్యుల‌ర్ యాక్సెస్, చెస్ట్ ట్యూబ్ ఇన్సర్షన్ లాంటి ప్రొసీజ‌ర్లకు ఇది చాలా ఉప‌యుక్తం’’ అని వివ‌రించారు. పాల్గొన్న వారంద‌రి నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావ‌డంతో ఈ వ‌ర్క్ షాప్ విజ‌య‌వంత‌మైంద‌ని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రి ప్రతినిధులు తెలిపారు. భ‌విష్యత్తులో పాయింట్ ఆఫ్ కేర్ అల్ట్రాసౌండ్ (పోక‌స్‌) గురించి మ‌రిన్ని వ‌ర్క్ షాప్ లు నిర్వహిస్తామ‌ని చెప్పారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కిమ్స్ ఐకాన్ మేనేజింగ్ డైరెక్టర్  డా. సతీష్ కుమార్ పెతకంశెట్టి, డా. టి మోహన్ ఎస్. మహరాజ్, డా. టి. లక్ష్మి రాణి పాల్గొన్నారు.

About Author