PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వివిధ కోర్సులపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) న్యూఢిల్లీ వారు  వివిధ కోర్సులపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కల్గించడానికి ఇగ్నో ప్రాంతీయ కార్యాలయం విశాఖప్పటం నుంచి ది.05-03-2024న డిప్యూటీ డైరెక్టర్ డా:ఇ కృష్ణారావు సర్ సి. ఆర్. రెడ్డి అటానమస్ కళాశాలలో గల ఇగ్నో స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ శ్రీ కె.ఎస్.సి.హెచ్. శ్రీనివాసరావుతో కలిసి బి.ఏ. మరియు బి.కాం. విద్యార్థినీ, విద్యార్థులకు ఇగ్నోలో వారికి ఉపయోగపడే కోర్సుల గురించి క్షుణ్ణంగా వివరించారు. బి.ఏ. మరియు బి.కాం కోర్సులలో చేరే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందని తెలియజేశారు. వీటితోపాటు సర్టిఫికెట్ కోర్సులైన ఫుడ్ మరియు న్యూట్రిషన్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ హ్యూమన్ రైట్స్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలతో పాటు నూతన విద్యావిధానం-2020లకు అనుగుణంగా ఇగ్నోలో నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఈ సంవత్సరం నుంచే అందుబాటులోనికి వచ్చాయని తెలియజేశారు. కోర్సులు చేసిన విద్యార్థులకు నైపుణ్యంతోపాటు వృత్తివిద్యా శిక్షణ మరియు ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభిస్తాయని ఒక ప్రకటనలో తెలయజేశారు. సర్ సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాలను సందర్శించి అక్కడ గల విద్యార్థినులకు ఇగ్నోలో వివిధ రకాల కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా:కె ఏ.రామరాజు, అధ్యాపకులు మరియు విద్యార్థులు విచ్చేశారు.

About Author