కోదండ రామాలయం భూములు వేలం
1 min readపల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: వీరబల్లి మండల పరిధిలోని మట్లిగ్రామ పంచాయితీలోని మాండవ్య నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రం శ్రీ కోదండ రామాలయం భూములను బుదవారం కౌలుకు వేలం పాట నిర్వహించారు. మట్లి పంచాయితీ సర్పంచ్ సామారపు నాగార్జునాచారి అధ్యక్షతన దేవాదాయ శాఖ ఈఓలు కొండా రెడ్డి,మంజుల, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఈ వేలం పాటను నిర్వహించారు. మట్లి, తాటిగుంటపల్లి పంచాయతీలో వున్న 25 ఎకరాల మాగాణి,మెట్ట భూములకు ఒక సంవత్సరానికి గాను 5 మంది రైతులు 46 వేల రూపాయలకు వేలం పాటలో దక్కించుకున్నారు. ఆలయ అభివృద్ధికి కి తమ వంతు బాధ్యతగా కృషిచేస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్లి మాజీ సర్పంచ్ కొల్లి రవి నాయుడు, గుదే నాగభూషణం,కేశవులు,రమణయ్య ప్రజలు పాల్గొన్నారు.