NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడుమూరు కాంగ్రెస్ టికెట్ కు ఈ లాజరస్ దరఖాస్తు  

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కాంగ్రెస్ పార్టీ తరఫున కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎండ్లూరి లాజరస్  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తును సమర్పించారు. శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్నభవన్ లో నియోజక వర్గ నాయకులతో కలిసి పార్టీ టికెట్ కోసం ధరఖాస్తును సమర్పించారు. ఈ సందర్భంగా లాజరస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిల రెడ్డి  నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ తోనే పేద , బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో పాటు కోడుమూరు నియోజక వర్గం అభివృద్ది కూడా కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని పేర్కొన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ది కోసం ముందుకు వస్తుందని, రాష్ట్ర ప్రజలు తమ కోసం తమ బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీనీ ఆదరిస్తారనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సిసెల్  ఛైర్ పర్సన్ సాకే శంకర్ , కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు కే బాబురావు , నియోజకవర్గ నాయకులు రవి ప్రకాష్ , రవి కుమార్ , నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author