NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొల్లేటి అభివృద్ధి చింతమనేనితోనే సాధ్యం..

1 min read

దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో  ప్రభాకర్ ని మార్యదపూర్వకంగా కలిసిన కొల్లేటి నాయకులు, ప్రజలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : కొల్లేటి గ్రామాల అభివృద్ధి జరగలన్నా, తమ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మెరుగు అవ్వాలన్నా దెందులూరు ఎమ్మెల్యే గా చింతమనేని ప్రభాకర్ మళ్ళీ అధికారం చేపట్టాలని కొల్లేటి ప్రాంత నాయకులు తెలిపారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రజలు మంగళవారం మర్యాద పూర్వకముగా కలిశారు.ఈసందర్భంగా టిడిపి హయాంలో దెందులూరు ఎమ్మెల్యే గా చింతమనేని ప్రభాకర్ తమ కొల్లేటి గ్రామాల అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి ఎంతగానో సహకరించారని అన్నారు. నేడు వైసిపి ప్రభుత్వ హయాంలో రహదారుల దుస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. కొల్లేటి ప్రజల అవస్థలను పోగొడుతూ ప్రజల సౌకర్యం కోసం నాడు రహదారుల నిర్మాణాలను చేపట్టిన ఘనత చింతమనేనికే సొంతం అని అన్నారు. రాబోయే రోజుల్లో తమ కొల్లేటి ప్రాంతాల ప్రజలు మొత్తం టిడిపి జనసేన కూటమికి మద్దతు ఇచ్చి, భారీ మెజారిటీతో చింతమనేనిని గెలిపించు కుంటామని, కొల్లేటికి పూర్వవైభవం తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నగడ్డ శ్యాంబాబు,ముంగర నాగరాజు, జొన్నగడ్డ బాబు, తెనాలి చిన్ని, సైదు శివన్నారాయణ,  జల్లూరి వీర్రాజు, వేగేశ్న ప్రసాదరాజు, మెండ్రు రాజు, మెండ్రు రవి, గడిదేసి డేవిడ్, గడిదేసి శ్యాంబాబు, యాళ్ళ రోహిణి చంద్రుడు, యాళ్ల షడ్రక్, సైదు రామకృష్ణ, పెనుగొండ దావీదు, చెన్నకేశవ దైశాలి సహా పలువురు కొల్లేటి ప్రాంత నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author