PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 కొల్లేటికోట శ్రీ పెద్దింట్లమ్మ జాతర మహోత్సవం

1 min read

 పల్లెవెలుగు వెబ్​,ఏలూరు: కృష్ణాజిల్లా,మండలం, కొల్లేటికోట గ్రామంలో వేంచేసియున్న శ్రీ పెద్దింటి అమ్మ వారి దేవస్థానంలో జరుగుతున్న జాతర మహోత్సవములలో భాగంగా 2 వ రోజు శుక్రవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శించుకున్నారు.ఉదయం గం.5 నుండి గం.6 ల వరకు శ్రీ జలదుర్గ సమేత శ్రీ పెద్దింటి అమ్మ వార్లకు సుగంధ ద్రవ్యాభిషేకం, పంచఫల రసభిషేకం, హరిభ్రాజస అభిషేకం మరియు నూతన వస్త్రాలంకరణ,ప్రధమావరణపూజా,ప్రధమావరణ కలశపూజ,పుష్పాలంకరణ, ధూELR- పూజా కార్యక్రమముల నిర్వహించారు.అనంతరం బాలభోగం,హారతి కార్యక్రమములు దేవస్థానం ఉపప్రధాన అర్చకులు శ్రీ పెటేటి పరమేశ్వరశర్మ నిర్వహించారు అనంతరం ఉచిత ప్రసాదం వితరణ,అమ్మవార్లకు వస్త్రాలంకరణ చేయించిన దాత ప్రత్తికోలంక వాస్తవ్యులు  మహాలక్ష్మీ రాజు,శ్రీమత శ్రీదేవి, పుష్పాలంకరణగావించారు.జబలపట్నం వాస్తవ్యులు సయ్యపరాజు గుర్రాజు శ్రీమతి జానకి దంపతులు.భక్తులకు ఉచిత ప్రసాదం ఏర్పాట్లు చేశారు.ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి గోపాలరావు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఉచిత పందిర్లలో భక్తులు పాల పొంగళ్ళు,వంటలు చేసుకున్నారు. మంచి నీటికి ఇబ్బందులు లేకుండా చలివేంద్రాలు మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంపు, ఫైర్ సేఫ్టీ, పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు,సర్కార్ కాలువ నుండి దేవాలయం వరకు,గోకర్ణపురం నుండి దేవాలయం వరకు నీళ్ళ ట్యాంకర్లతో రోడ్లు తడిపించుట,భక్తులకు ఏవిధమైన అసౌకర్యము కలగకుండా ఆలయ చైర్మన్ పూలవర్తి లక్ష్మణరావు, ధర్మకర్తలమండలి సభ్యులు సమక్షంలో ముందస్తుగా ఏర్పాట్లు పర్యవేక్షించారు. జాతర ఉత్సవముల 16 రోజులు  కార్యక్రమం పంచహారతులు కార్యక్రమం జరుగుతుందని ఈ ఓ కె.వి గోపాలరావుతెలిపారు.కైకలూరు వాస్తవ్యులు శ్రీమతి వసుమతి శ్రీవల్లి అధ్వర్యంలో కూచుపుడి భరతనాట్యం ప్రదర్శన భక్తులను అలరించింది.

About Author