NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోమ‌టి రెడ్డి కామెంట్స్.. హైకమాండ్ సీరియ‌స్

1 min read

ప‌ల్లవెలుగు వెబ్ : తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామ‌కం కాంగ్రెస్ లో కాక రేపింది. ప‌లువురు సీనియ‌ర్లు రేవంత్ ఎంపిక‌ను వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ పై విమ‌ర్శలు చేస్తున్నారు. చివ‌రి వ‌ర‌కు పీసీసీ రేసులో ఉన్న కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి.. రేవంత్ కు పీసీసీ ద‌క్కడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులాగే.. పీసీసీ చీఫ్ ఎన్నిక జ‌రిగింద‌న్నారు. ల‌క్షలాది మంది కార్యక‌ర్తల మ‌నోభావాలు దెబ్బతిన్నాయ‌న్నారు. దీంతో కోమ‌టిరెడ్డి వ్యాఖ్యల‌పై హైక‌మాండ్ కు రాష్ట్ర నేత‌లు స‌మాచారం ఇచ్చారు. ఏఐసీసీ నేత‌లు కోమ‌టి రెడ్డి వ్యాఖ్యల‌ను ఖండించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే స‌హించేద‌నిలేద‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ హెచ్చరించారు.

About Author