సంక్షేమ పధకాలతో కొండంత భరోసా : మాజీ మంత్రి ఆళ్ల నాని
1 min read–మహిళలు పెద్ద ఎత్తున పూల వర్షంతో అడుగడుగునా నానికి నీరాజనాలు
పల్లెవెలుగు, వెబ్ ఏలూరు: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న నవరత్నాల సంక్షేమ పధకాలతో అన్ని వర్గాల ప్రజలకు తమ జీవితాల్లో కొండంత భరోసా లభిస్తుందని మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు,26వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శనివారం ఏలూరు కార్పొరేషన్ 13 వ డివిజన్ వెంకటాపురం సచివాలయం-4 పరిధిలోని YSR కాలనిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని పర్యటించారు,ఏలూరు 13వ డివిజన్ కార్పొరేటర్ నిడికొండ అన్నపూర్ణ,నగర వైఎస్సార్ సిపి అధ్యక్షులు నిడికొండ నరేంద్ర ఆధ్వర్యంలో మాజీ ఉపముఖ్యమంత్రి,ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానికి స్థానిక వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, డివిజన్ లోని ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు,భారీ గజమాలలు, మంగళ హారతులతో, దుస్సాలువాల సత్కారంతో ఆళ్ల నాని కి జనం నీరాజనాలు పలికారు..స్వాగత ఏర్పాట్లు లో భాగంగావైఎస్సార్సీపీ నాయకులు మణి రాజు ఆధ్వర్యంలో చిన్నారులు చేసిన కర్రసాము అందరిని ఆకర్షించింది.నవరత్నాల సంక్షేమ పధకాలు ప్రతిబింబించేలా ఆయా పధకాల లబ్దిదారులు ప్లకార్డులు పట్టుకుని ఆళ్ల నాని కి కృతజ్ఞతలు తెలిపారు,2005 వ సంవత్సరం లో ఏలూరులోని పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేయటం కోసం అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఎమ్మెల్యే గా ఆళ్ల నాని ఎంతో కృషి చేసి 1725 ఇళ్ళు నిర్మించి పేదల కోసం అతి పెద్ద కాలనీని ఏర్పాటు చేశారు.దీనిద్వారా రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగించే వందలాది బడుగు బలహీన వర్గాల సొంత ఇంటి కల ఆనాడు ఆళ్ల నాని సాకారం చేశారు.కాలనీలోని మౌలిక వసతుల కల్పనను మెరుగుపరుస్తూ సిసిరోడ్లు, వాటర్ ట్యాన్క్, డ్రెయిన్లు వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టి కాలనీ ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందించారు.మరోసారి వైఎస్సార్ కాలనీ ప్రజల సంక్షేమం కోరుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో తమ్మిలేరు వరద ముంపు నుంచి వైఎస్సార్ కాలనీ ప్రజలకు రక్షణ కల్పిస్తూ తమ్మిలేరు రివిట్మెంట్ వాల్ ని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని నిర్మించారు.తమకు సొంత ఇంటిని నిర్మించి ఇవ్వటంతో పాటు, తమ రక్షణ కోసం రివిట్మెంట్ వాల్ నిర్మించిన ఆళ్ల నాని కి ఈ సందర్భంగా స్థానిక ప్రజలు అడుగు అడుగునా నీరాజనాలు పలికారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ది దారులతో మాట్లాడుతూ ఆళ్ల నాని స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా తమ సంక్షేమము కోసం జగనన్న అందిస్తున్న నవరత్నాల పథకాలపై లబ్దిదారులు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
వైఎస్సార్ చేయూత, ఆసరా, అమ్మ ఓడి, విద్యా దీవెన, ఫీజ్ రీ అంబర్స్మెంట్ ,రైతు భరోసా వంటి అనేక సంక్షేమ పథకాలతో తమ జీవితాల్లో కొండంత భరోసా లభించిందని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అర్హత ఉండి కూడా సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారి సమస్యలను సత్వరమే ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పరిష్కరించాలని ఆళ్ల నాని అధికారులకు సూచించారు.అదే విధంగా ప్రజలు తెలిపిన స్థానిక సమస్యలు సత్వరమే పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కాలనీలో మంచినీటి సరఫరాను మెరుగు పరిచేలా నూతన ఓవర్ హెడ్ ట్యాంక్ ను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని, YSR కాలనీ వాసులకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని ఆళ్ల నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, నగర వైఎస్సార్ సిపి అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచెమ్ మైబాబు, డైరెక్టర్లు కోరాడ బాబు, మేతర సురేష్, కో-అప్షన్ సభ్యుల లు ఎస్ ఎం ఆర్ పెదబాబు, కార్పొరేటర్లు జిజ్జువరపు విజయ నిర్మల,తుమరాడా స్రవంతి,సుంకర చంద్రశేఖర్, కడవకోల్లు సాంబా, పొలిమేర దాస్, జయకర్, దేవరకొండ శ్రీనివాస్, వైఎస్సార్ సిపి నాయకులు ఎం ఆర్ డి బలరాం, మోటమర్రి సదానంద్,పొలిమేర హరికృష్ణ, కిలాడి దుర్గారావు ,నున్న కిషోర్,లూటుకుర్తి సుభాష్, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు,దారపు తేజా, మట్టా రాజు,మల్లిక్, భారతి వెంకట రావు, పోతురాజు, అప్పారావు, రమేష్, రాము, కృష్ణ, లక్ష్మణ్ రావు, విజయలక్ష్మి, మణి రాజు ,లంకలపల్లి గణేష్,ధనుంజయ్,పార్వతి, సుల్తానా, తోటకూర కిషోర్, విఠల చంద్రశేఖర్,ఎల్లపు మోజెస్,లీగల్ సెల్ నాయకులు ఆచంట వేంకటేశ్వర రావు,శశిధర్ రెడ్డి,దొంగ రామాంజనేయులు, తంబీ, మునిసిపల్ కమిషనర్ షేక్ షాహీద్,ఎమ్మార్వో సోమ శేఖర్, ఎలక్ట్రికల్ ఏఈ శేషగిరిరావు, ఎం హెచ్ ఓ డా:మాలతి,వివిధ శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు,పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.