కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు
1 min read– దుర్గా భోగేశ్వరుడికి సంతరించుకున్న మహాశివరాత్రి శోభ.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: అమాయకత్వం ప్రేమ ప్రాయశ్చిత్తం కలగలిసిన ఓ కథను అక్షరాల మానవాళికి గుణపాఠంగా నిలుస్తుంది దేశమంతా దైవ క్షేత్రాలలో ఎన్ని పూజలు చేసిన పాప పరిహారాన్ని ఆఖరికి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహారం జరగడంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ దేవస్థానానికిి ప్రత్యేక శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈనెల 18వ తేదీ నుండి మొదలయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాలు 21వ తేదీ ముగుస్తాయని ఆలయ చైర్మన్ ఐసాని సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులు నంద్యాల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కర్నూల్ నుండి నందికొట్కూరు నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి ఇక ఆలయ విశిష్టత గురించి చెప్పాలంటే ఇక్కడ పూర్వం భోగోలు అనే గ్రామం ఉండేదని అందునా ఈ క్షేత్రమునకు భోగేశ్వరం అనే పేరు వచ్చిందని చరిత్రలో లిఖించబడినది భోగోలు అనే గ్రామమునకు దగ్గర్లో మామిడిపల్లి అనే ఒక చిన్న కుగ్రామం ఉండేదని ఆ గ్రామంలో ఒక బీద దంపతులకు ఒక ఆడ ఒక మగ సంతానం ఉండేదని ఈ పిల్లలు చిన్న వయసులో ఉండగా తల్లితండ్రులు అకస్మాత్తుగా మరణించడం వలన చిన్నారులు సంతానం లేని వేరు కుటుంబీకులు చేరదీసే వారు చూసుకుని పెంచుకుంటూ ఉండగా అనుకోని సందర్భాలలో ఇద్దరిని వారు ఒకచోట కలిసి వారి గతం తెలియక వారిద్దరికీ వివాహం చేయాలని నిర్వహించారు వధూవరులు భార్యాభర్తలు ఉండే పడక గదిలోకి వెళ్లే ప్రయత్నంలో ఇంట్లో పడుకున్న సందర్భంలో ఆవు దూడ తోకను వరుడు తొక్కగా అప్పుడు ఆ దూడ తను తన తల్లి ఆవుతో మనిషి భాషలో అమ్మ వీడు నా తోక తొక్కారని తల్లికి తెలపగా తల్లి అయిన ఆవు వీడు కామంతో కళ్లు మూసుకొని సొంత చెల్లి తోనే పెళ్లి చేసుకొని కాపురం చేయాలని తలంపుతో ఉన్నవాడు మీ తోక తొక్కడం అదొక విషయం అని పలుకగా జరిగిన నిజం తెలుసుకున్న వారిద్దరూ మనం నిజంగా అన్నా చెల్లి అని తెలుసుకొని తల్లి అయిన ఆవు వద్దకు వెళ్లి మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అని వేడుకొనగా మీరు వెంటనే వి బాండ మహర్షి కుమారుడు ఋష్య శృంగా మహర్షి వద్దకు వెళ్లి శరణు వేడుకొని సమస్యను తెలపాలని చెప్పడంతో మహర్షి ఆశ్రమమునకు వెళ్లి ఋషిని వేడుకొని విషయమంతా అన్నా చెల్లెలు విన్నవించగా వారికి మీరు తలంబ్రాల వస్త్రాలు బ్రహ్మముడి తో అన్ని క్షేత్రాలలో స్నానం చేయండి ఎక్కడ మీ పసుపు వర్ణం వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోతారు అప్పుడు మీ పాపం పరిహారం అవుతుందని తెలపగా వెంటనే ఆ వధూవరులు అక్కడ నుంచి వెళ్లి అన్ని క్షేత్రాలు తిరిగి పండు ముసలి వాళ్లు అయినా వారి పాప పరిహారం కాలేదు చివరి మజిలీగా శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానం దర్శించి పంచామృత సరస్సులో స్నానం చేయగా వారి వస్త్రాల పసుపు వర్ణ వస్త్రాలు తెల్ల వస్త్రాలు గా మారి బ్రహ్మముడి విడిపోగా వధూవరులు ఈ క్షేత్రం నుంచి వెళుతూ దుర్వేసి గ్రామంలో శిలలుగా మారి భక్తులకు దర్శనం ఇస్తున్నారు కాశీ లో తప్ప మరి ఏ క్షేత్రంలో లేని కాలభైరవుడు ఈ క్షేత్రంలో ఉన్నందున ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అని కూడా అంటారు.