PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనులపండుగా కొణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవాలు

1 min read

– హోరాహోరీగా వృషబాలు బండలాగుడు పోటీలు.
– పోటీలను ప్రారంచిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.
– 20 ఏళ్ల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్వామి వారి ఉత్సవాలు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొణిదేల శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అంత్యంత వైభవంగా ఆలయ అధికారులు, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.20 ఏళ్ల చరిత్రలోనే భారీ ఎత్తున బహుమతులు అందజేసి వృషబాలు ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం శోచనీయం. జాతర ఉత్సవాలను గ్రామ సర్పంచి కొంగర నవీన్, ఆలయ ధర్మ కర్త కిరణ్ కుమార్, కార్యనిర్వహణాధికారి కార్తిక్ ,గ్రామ రైతు సంఘం, గ్రామ ప్రజల సహకారంతో ఆదివారం రథోత్సవం కార్యక్రమం కునులవిందుగా నిర్వహించారు.
రమణీయం…. రథోత్సవం..
కొణిదేల గ్రామ శ్రీ మత్కోణిదేల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి రథోత్సవం ఆదివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు.రథోత్సవ కార్యక్రమం గ్రామ సర్పంచి కొంగర నవీన్,ఆలయ ధర్మ కర్త కిరణ్ కుమార్ ,ఈఓ కార్తీక్ ఆధ్వర్యంలో వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు సుబ్రమణ్యం శర్మ స్వామి ఉత్సవ విగ్రహాలను రథంలో ఉంచి వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథోత్సవం కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఎమ్మెల్యే ఆర్థర్ కు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాల పూల వర్షం తో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుశ్శాసలువలతో ఆలయ అధికారులు ఎమ్మెల్యే ను ఘనంగా సత్కరించారు. రథోత్సవంలో నందికొట్కూరు మండలం నాగటూరు, బిజినేముల,పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్, ముచ్చుమర్రి, పగిడ్యాల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందికొట్కూరు అర్బన్ సీఐ విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఎన్.వి రమణ, పాములపాడు ఎస్సై అశోక్, పోలీస్‌ సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.
ఎద్దులు బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్థర్.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం పారువేట సందర్భంగా ఉదయం 7 గంటలకు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎద్దులు పెద్దబండ లాగుడు పోటీలను నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచి కొంగర నవీన్, ఆలయ ధర్మకర్త కిరణ్ కుమార్, గ్రామ రైతు సంఘం సహకారంతో పోటీలలో గెలుపొందిన వృషబాలకు మొదటి బహుమతి రూ.70 వేలు, రెండవ బహుమతి రూ. 50,000, మూడవ బహుమతి రూ. 30,000, నాలుగో బహుమతి రూ. 20,000, ఐదవ బహుమతి రూ. 10,000, ఆరవ బహుమతి రూ.5,000 అందజేశారు. అలాగే పోటీలలో పాల్గొన్న వృషబ రాజ్యములకు నాయకులు ప్రత్యేక బహుమతులు ప్రకటించి అందజేశారు.
ఎద్దుల బండలాగుడు పోటీలలో విజేతలు.సోమవారం పారువేట సందర్భంగా నిర్వహించిన ఎద్దులు పెద్ద బండలాగుడు పోతిలలో అనంతపురం జిల్లా గార్లదిన్నె కు చెందిన రామాంజనేయులు వృషబాలు అడుగులు లాగి ప్రధమ స్థానంలో నిలిచాయి. మొదటి స్థానంలో నిలిచిన వృషబాలకు రూ.70 వేల మొదటి బహుమతిని దాత ఆలయ ధర్మకర్త ఎస్. కిరణ్ కుమార్ అందజేశారు. రెండవ స్థానంలో నిలిచిన కొత్తకోట గురునాథ్ రెడ్డి వృషబాలు రూ.50 వేల బహుమతిని దాత సిద్దయ్య అందజేశారు. మూడవ స్థానంలో నిలిచిన క్రిస్టాపురం నాగరాజు వృషబాలు రూ.30వేల బహుమతిని దాతలు కొంగర మూర్తి, మల్లెపోగు చిట్టెన్న విజేతలకు అందజేశారు. అలాగే పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.గోపాల్, విజయ లక్ష్మి, నాగ లక్ష్మమ్మ, రామేశ్వరమ్మ, కళావతమ్మ,సింగిల్ విండో చైర్మన్ సగినేల ఉసేనయ్య ,ఉర్దూ అకాడమీ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ షూకురు, బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ రెడ్డి , వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి, తమ్మడపల్లి విక్టర్ , రైతు సంఘం నాయకులు, పెద్దమనుషులు రంగస్వామి, చేపల మహేష్,బాలన్న ,బెస్త రాజు,కొంగర దావీదు, దాసరి నాగరాజు,బండారు గోపాల్, నాగన్న, కొంగర అయ్యన్న ,మదారి గోపాల్, మల్లెపోగు చిట్టెన్న, పూజారులు నాగలక్ష్మయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

About Author