NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొణిదెల టీడీపీ సర్పంచ్​ వైసీపీ గూటికి..!

1 min read

– ఎమ్మెల్యే ఆర్థర్ సమక్షంలో 200 మంది టిడిపి కార్యకర్త లు చేరిక
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్​ కొంగర నవీన్ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. గ్రామానికి చెందిన 200 మంది తెలుగుదేశం కార్యకర్తలకు వైసీపీ కండువా కప్పి వైసీపీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచి కొంగర నవీన్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నచ్చి , గ్రామాభివృద్ధికి కోసం వైసిపి పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవ రత్నాలు, వైఎస్సార్ చేయూత, అమ్మవడి, రైతు బరో సా, విద్యా దీవెన , వైఎస్ఆర్ ఆసరా వంటి పథకాలు ప్రజలకు అందించడం, గ్రామాభివృద్ధికి పాటు పడడమే లక్ష్యంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ నేరవేరుస్తున్నారని తెలిపారు. పదవీ స్వీకారం చేసినప్పటి నుంచి సీఎం జగన్ ప్రతిక్షణం పేదల బాగోగుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు చెరుకుచర్ల రఘు రామయ్య,సింగిల్ విండో అధ్యక్షుడు బాలస్వామి, ఉప సర్పంచి భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ లు ధర్మరెడ్డి, వైసిపి నాయకులు సుధాకర్ రెడ్డి, మాణిక్య రాజు, సాలే బాలన్న, రంగ స్వామి, వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి వనజ , మండల నాయకులు,శాతనకోట వెంకటేశ్వర్లు, జగన్ రఫీ,దేశెట్టి, అయ్యన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author