కోట ఆంజనేయ స్వామి ఆలయం స్థలాలను బేషరతుగా ఖాళీ చేయించాలి
1 min read– హిందూ ధార్మిక సంస్థలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాత నగరం నగరేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే అతి పురాతన శ్రీ కోట ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ సి జి ఎఫ్ నుండి నిధులు విడుదలైన సందర్భంగా ఆలయాన్ని విశాలంగా నిర్మించాలని నిర్ణయించిన ఆలయం అనువంశిక ధర్మకర్త కందాళ రామాచార్యులు నిర్ణయించారు కానీ గత కొన్ని సం.లుగా సుమారు 21 కుటుంబాలు దేవాలయం స్థలాన్ని ఆక్రమించుకుని ఖాళీ చేయడానికి నిరాకరించడం తో దేవదాయ – ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ తీర్పు మేరకు సదరు ఆక్రమిత స్థలాన్ని వెంఠనే ఖాళీ చేయించాలని దేవాదాయ శాఖ,రెవెన్యుశాఖ,పోలీసు శాఖలకు ఆదేశాలు ఇచ్చినా,రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా సదరు తీర్పు ను దృవీకరిస్తూ వెంఠనే కోట ఆంజనేయ స్వామి ఆలయం స్థలాలను ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇచ్చినా పోలీసు, రెవెన్యూ శాఖ ల అధికారులు నిర్లక్ష్య వైఖరితో ,రకరకాల కారణాలు చూపుతూ ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయించడానికి అలసత్వం ప్రదర్శిస్తోందని కర్నూల్ నగరంలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ సమావేశ భవనములో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ లు ఆరోపించారు.బారతీయ జనతాపార్టీ నాయకులు కే. హరీష్ బాబు మాట్లాడుతూ దేవాదాయశాఖతో కలిసి పోలీసు,రెవెన్యూ శాఖలు సమన్వయంతో కోట ఆంజనేయ స్వామి ఆలయం స్థలాలను బేషరతుగా ఖాళీ చేయించాలని లేనియెడల హిందూ ధార్మిక సంస్థలతో కలిసి తీవ్రమైన ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఇంకా భాజాపా మహిళా నాయకురాలు మాలతి, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నగర అధ్యక్షులు సందడి సుధాకర్ లు ఈ విషయం పై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎస్సీ పరిరక్షణ సమితి కర్నూలు నగర కన్వీనర్ ప్రతాప్, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాశ్, జిల్లా సహ కార్యదర్శి గోవిందరాజులు, నగర కార్యదర్శి ఈపూరీ నాగరాజు, హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మల్లెల పెద్ద పుల్లారెడ్డి, మహాబలేష్, సందడి మహేశ్వర్, బజరంగ్ దళ్ నాయకులు భగీరథ, భాస్కర్, ప్రకాష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.