NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీఎస్పీ జిల్లా ఇన్చార్జిగా కొత్తూరు లక్ష్మీనారాయణ

1 min read

పల్లెవెలుగు వెబ్  అనంతపురం : బహుజన సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా ఇన్చార్జిగా కొత్తూరు లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.  అనంతపురం జిల్లా  కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గురువారం జిల్లా బాడీ సమావేశం నిర్వహించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గద్దెల నాగభూషణం అధ్యక్షతన జరిగిన సమావేశానికి   రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతం కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు కొత్తూరు లక్ష్మీనారాయణ గారిని అనంతపురం జిల్లా ఇన్చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జూన్   19న మదనపల్లి లో జరిగే రాజ్యాధికార సభను విజయవంతం చేయడానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఉపాధ్యక్షుడు గౌతమ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నూతనంగా జిల్లా ఇన్చార్జిగా నియమతులైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో పార్టీని గడపగడపకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. తనను జిల్లా ఇన్చార్జిగా నియమించిన పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ కుమారి మాయావతి గారికి, రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్ కుమార్ గారికి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంల జిల్లా అధ్యక్షులు గద్దల నాగభూషణం,  జిల్లా ఇన్చార్జి తిరుమలయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author