కనుల పండువుగా కోటి మహా దీపోత్సవం
1 min read– విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం
పల్లెవెలుగు, వెబ్ కమలాపురం : ఈ భూమిలో ఎక్కడా లేని విధంగా అత్యంత పురాతన దేవతా విగ్రహ మూర్తులు శ్రీ మహాలక్ష్మీమోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన దేవాలయం లో కోటి మహా దీపోత్సవం అద్భుతంగా నిర్వహించారు ప్రతి రోజు ఒకే వేదిక పై నిత్య కళ్యాణం జరిగే శ్రీ రామాపురం మాహా పుణ్యక్షేత్రంలో కార్తీక మాస కృత్తికా నక్షత్ర శుభ యుక్త రోజైనా బుధవారం నాడు సాయంత్రం కోటి మహా దీపోత్సవం కనుల పండుగ నిర్వహించారు .. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూలమాలల అలంకరణలతో శోభాయమానంగా అలంకరించారు.. ఉదయం నుంచి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు కాలసర్పదోష నివృత్తి హోమాలు విశేష పూజలు నిర్వహించారు . సాయంత్రం వేద పండితులు మంత్రోచ్ఛారణ ల మధ్య కోటి మహా దీపోత్సవం ప్రజ్వలన ఆలయ ప్రధాన సేవకులు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ, చేతుల మీదుగా నిర్వహించారు.. ఆలయానికి విచ్చేసిన భక్తాధులు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వల్లి దేవసేన సమేతంగా ఆలయ మాడవీధులలో మయూరవాహనంపై ఊరేగింపు నిర్వహించారు . కోటి దీపోత్సవం అనంతరం జ్వాలా తోరణం నిర్వహించారు. వేద పండితులు ఆలయ అర్చకులు జగదీష్ శర్మ ప్రదీప్ శర్మ నిర్వాహకులు శివరామ శర్మ లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.. కోటి దీపోత్సవానికి విచ్చేసిన భక్తాదులు అందరికీ ఆలయ సేవకుల ఆధ్వర్యంలో ఆన్న ప్రసాద సేవా కార్యక్రమం నిర్వహించారు.