NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోవిడ్ ఎఫెక్ట్.. వైద్య రంగానికి 50 వేల కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన రెండో ద‌శ వ్యాప్తితో దెబ్బతిన్న భార‌త ఆర్థిక వ్యవ‌స్థకు కేంద్ర ప్రభుత్వం ఊపిరులూదింది. వైద్య రంగ వ‌స‌తుల క‌ల్పన పై దృష్టి పెట్టింది. దాదాపు 50 వేల కోట్లు వైద్య రంగానికి కేటాయించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామ‌న్, స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియా స‌మావేశంలో వెల్లడించారు. టైర్ 2,3 ప‌ట్టణాల్లో వైద్య వ‌స‌తుల క‌ల్పన‌, విస్తర‌ణ చేప‌ట్టనున్నారు. ఉత్తర ప్రదేశ్ లో వైద్య సౌక‌ర్యాల క‌ల్పన పై ప్రత్యేక దృష్టి సారించ‌నుంది. వైద్య సౌక‌ర్యాల క‌ల్పనకు 50 వేల‌ కోట్ల కేటాయింపు చేశారు. ఇత‌ర రంగాల‌కు 60 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించారు. వైద్య సంస్థల‌కు స‌హాయం చేసే సంస్థల‌కు అండ‌గా ఉన్నట్టు తెలిపారు.

About Author