‘కోవిడ్’ కేర్ సెంటర్లలో వినూత్న కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కోవిడ్ కేర్ సెంటర్లలోని రోగులకు మానసికోల్లాసం, వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాజాత బృందాలతో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని కేర్ సెంటర్లలో కళాజాత బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కోవిడ్ బాధితులు ఉత్సాహంగా వీక్షించారు. కళాజాతల నిర్వహణ కోసం దాదాపు రూ.4.50 లక్షల బడ్జెట్ ను మంజూరు చేసి కళాకారుల గౌరవ వేతనం చెల్లింపు కోసం రూ.2.25 లక్షల అడ్వాన్స్ ను జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు కు విడుదల చేసినట్లు కలెక్టర్ జి. వీరపాండియన్ తెలిపారు. దీంతో కళాజాత బృందం కేర్ సెంటర్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.