స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా కోవిడ్ లక్షణాలు !
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ లక్షణాలు ఒక్కో వ్యక్తిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. ఇవి వయసుతో పాటు స్త్రీ, పురుషుల్లో కూడ వేర్వేరుగా ప్రభావం చూపిస్తున్నాయని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తాజా పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ డిజిటల్ హెల్త్ లో ప్రచురితమైంది. శ్వాస సరిగా ఆడకపోవడం, అలసట, చలి జ్వరం లాంటి లక్షణాలు పురుషుల్లో కనిపిస్తున్నాయని, స్త్రీలలో వాసన కోల్పోవడం, ఛాతీ నొప్పి, తీవ్రమైన దగ్గు లక్షణాలు ప్రధానంగా ఉన్నట్టు బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ ప్రారంభంలో కనిపించే లక్షణాలు వ్యక్తులతో పాటు కుటుంబాల్లోనూ వేర్వేరుగా ఉంటాయని కింగ్స్ కాలేజీ నిపుణులు క్లెయిర్ స్టీవ్స్ పేర్కొన్నారు. సొంత అంచనాలతో కోవిడ్ లక్షణాలు పసిగట్టడం ద్వార వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు సమర్థవంతంగా పనిచేయవచ్చని తెలిపారు.