కృపావతికి భూ విజ్ఞాన శాస్త్రంలో వై.వీ.యూ డాక్టరేట్
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం భూ విజ్ఞాన శాస్త్ర విభాగ పరిశోధకురాలు చింతల కృపావతి కి విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రకటించింది. భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహ ఆచార్యులు డా యస్. శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో ” మొగమురేరు నది పరివాహక ప్రాంత పరిశోధనాత్మక విశ్లేషణ: రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం సాంకేతికతో కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ ” అనే అంశంపైన చింతల కృపావతి విస్తృత పరిశోధనలు చేసి రూపొందించిన గ్రంథాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల విభాగానికి సమర్పించారు. వై వీ యూ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ మార్గదర్శకం మేరకు నియమితులైన నిపుణుల బృందం, పరిశోధకురాలు చింతల కృపావతి రూపొందించిన పరిశోధన గ్రంథం అధ్యయనం చేసి డాక్టరేట్ అర్హత ఉందంటూ ధ్రువీకరించారు. ఈ మేరకు డాక్టరేట్ ప్రొసీడింగ్స్ను వై వీ యూ పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య నల్లపురెడ్డి ఈశ్వర రెడ్డి జారీ చేశారు. పరిశోధనలను కొనసాగించుటకై సి. కృపావతికి, న్యూఢిల్లీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదేళ్ల ఇన్స్పైర్ ఫెలోషిప్ రూపంలో ఆర్థిక సాయం చేసింది. డి.ఎస్.టి ఇన్స్పైర్ ఫెలోషిప్ ను ఎంఎస్సీ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ కు పీహెచ్ డీ చేయడానికి ఇచ్చే ప్రతిష్టాత్మక ఆర్థిక సహాయం లభించింది. పరిశోధకురాలు పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులతో పరిశోధక పత్రాలు సమర్పించి ప్రచురించారు. భూ విజ్ఞాన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ అందుకున్న కృపావతిని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్, కుల సచీవులు ఆచార్య వై.పి వెంకటసుబ్బయ్య , ప్రధానాచార్యులు ఎస్. రఘునాథ్ రెడ్డి, ఉప ప్రధానాచార్యులు టి. శ్రీనివాస్, భూ విజ్ఞాన శాస్త్ర ఆచార్యులు అధ్యాపకులు స్కాలర్స్ విద్యార్థులు ,అభినందించారు.