PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పోతిరెడ్డిపాడు’ను పరిశీలించిన కేఆర్​ఎంబీ బృందం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తనిఖీ చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) బృందం బుధ‌వారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్‌ను ప‌రిశీలించింది. బోర్డు స‌భ్యులు రాయ‌పూరే, హ‌ల్వార్‌, మియాన్ సంఘ్‌, మేటాంగీ, సీఈ ముర‌ళీధ‌ర్ రెడ్డి, ఎస్ఈ నారాయ‌ణ‌రెడ్డిలు ప‌నుల‌ను ప‌రిశీలించారు. సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు అక్కడేమైనా పనులు జరుగుతున్నాయో లేదో నివేదిక ఇవ్వాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. కేఆర్ఎంబీని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని నేరుగా వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించ‌డంతో బోర్డు స‌భ్యులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేట‌ర్‌ను సంద‌ర్శించారు.

కాగా, సీమ ఎత్తిపోతుకు అనుమతుల్లేవని.. అయినా నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని చాలా కాలంగా కృష్ణాబోర్డు కూడా ఏపీ ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. అయితే.. ఏపీ సర్కార్ మాత్రం అక్కడ పనులేమీ జరగడం లేదని.. డీపీఆర్‌కు అవసరమైన సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని చెబుతోంది. కానీ అక్కడ పూర్తి స్థాయి పనులు చేస్తున్నారని ఎన్జీటీకి ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిస్తోంది. గతంలోనే పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో సీమ ఎత్తిపోత‌ల‌ పనుల‌పై కృష్ణా బోర్డు నివేదిక ఇవ్వనుంది

About Author